భారత్‌ ధైర్యంగా నిలబడింది..!

తాజా వార్తలు

Updated : 02/07/2020 11:35 IST

భారత్‌ ధైర్యంగా నిలబడింది..!

డ్రాగన్‌ యాప్‌ల నిషేధాన్ని ప్రశంసించిన నిక్కీహేలీ

వాషింగ్టన్‌: చైనా వ్యవహార ధోరణిపై భారత్‌ వెనకడుగు వేయడంలేదని ఇండో-అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. ఇటీవల డ్రాగన్‌తో లద్ధాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ సోమవారం కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో టిక్‌టాక్‌‌తో పాటు యూసీ బ్రౌజర్‌, క్యామ్‌స్కాన్‌ తదితర యాప్‌లూ ఉన్నాయి. వాటి వాడకం వల్ల మన వ్యక్తిగత సమాచారంవిదేశీ సర్వర్లలో నిక్షిప్తం అవుతోందని, భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ తదితర అంశాలకు ఇది హాని చేస్తుందని భావించి నిషేధించారు. 

నిక్కీ బధవారం ట్వీట్‌ చేస్తూ భారత్‌ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్‌టాక్‌తో సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే చైనా దూకుడు విషయంలోనూ భారత్‌ వెనకడుగు వేయకుండా నిలిచిందని మెచ్చకున్నారు. కాగా, ఇదే విషయంపై అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ‘చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధీనంలో నడుస్తున్న మొబైల్‌ యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని స్వాగతిస్తున్నా’ అని పాంపియో విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రత పెరుగుతుందన్నారు. అది వారి జాతి భద్రతకు ఉపయోకరమని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని