హెచ్‌1బి వీసా ఎఫెక్ట్‌: తెలుగు వారిపై తక్కువే!

తాజా వార్తలు

Updated : 24/06/2020 13:45 IST

హెచ్‌1బి వీసా ఎఫెక్ట్‌: తెలుగు వారిపై తక్కువే!

తానా అధ్యక్షుడి స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెచ్‌1బీ వీసాలపై అమెరికా విధించిన తాజా ఆంక్షలు తెలుగువారిపై కొంతమేరకు మాత్రమే ప్రభావం చూపవచ్చని తానా అధ్యక్షులు జయకుమార్‌ తాళ్లూరి అన్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఎటువంటి సమస్యా లేదని.. కొత్తగా ఈ దేశానికి రావాలనుకుంటున్న వారికి మాత్రం కాస్త కష్టమని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ఉంటూ, వీసా కాలపరిమితి అయిపోయిన వారు.. ఈ దేశంలోనే ఉన్నంత వరకూ ఏ సమస్యా రాదని చెప్పారు. కాగా, వారిని అమెరికా నుంచి బయటకు వెళ్లి వచ్చేందుకు అనుమతించరని తానా అధ్యక్షులు వివరించారు. ఓపీటీ లేదా స్టూడెంట్‌ వీసాలపై వచ్చిన వారికి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. తెలుగువారిపై కొంతవరకు ప్రభావం ఉండేమాట నిజమేనని... అయితే అందుకు భయపడాల్సిన అవసరం లేదని జయకుమార్‌ స్పష్టం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని