హెచ్‌-1బీ వీసాలపై నిషేధం! 

తాజా వార్తలు

Updated : 23/06/2020 10:28 IST

హెచ్‌-1బీ వీసాలపై నిషేధం! 

అమెరికా ప్రకటన...భారతీయ నిపుణులకు ఎదురుదెబ్బ
లాటరీ విధానం రద్దు, నూతన విధానం ఏదంటే...

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాల జారీకి సంబంధించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ వలస విధానం ‘ప్రతిభ ఆధారంగా’ మాత్రమే ఉంటుందంటూ... ఆ దిశగా మార్పులకు శ్వేతసౌధం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌-1బీ వీసాల జారీని ఈ సంవత్సరాంతం వరకు రద్దు చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటిచ్చేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నిర్ణయం జూన్‌ 24 నుంచి అమల్లోకి రానుంది.

కొత్త విధానం ఇదే..

ఇప్పటి వరకు లాటరీ విధానం ద్వారా హెచ్‌-1బీ వీసాలు జారీ అయ్యాయని... ఇకపై గరిష్ట వేతన స్థాయి అధారంగా  జారీచేయనున్నామని అమెరికా అధికారులు తెలిపారు. సంస్కరణల్లో భాగంగా.. అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగులకు మాత్రమే హెచ్‌-1బీ వీసా జారీలో పెద్ద పీట వేస్తామని అధికారులు ప్రకటించారు. తద్వారా నిపుణులు మాత్రమే తమ దేశంలోకి అడుగుపెట్టే వీలు కలుగుతుందన్నారు. అమెరికా ఉద్యోగులను, చౌకగా లభించే ఇతర దేశాల ఉద్యోగులతో భర్తీ చేసే వీలు కలిగిస్తున్న ఇమ్మిగ్రేషన్‌ విధానాలలో లోపాలను సవరిస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాగం ప్రకటించింది.

భారతీయ నిపుణులపై ప్రభావం

ఈ నూతన విధానం వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు విదేశీయుల నుంచి పోటీ తగ్గుతుందని వారన్నారు. ఇక వేతన, నైపుణ్యం పరంగా వీసాదారులకు కూడా ప్రయోజనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ నిర్ణయాల వల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులపై ప్రభావం పడనుందని నిపుణులు అంటున్నారు. వారు వీసా స్టాంపింగ్‌ కోసం సంవత్సరం చివరి వరకు వేచిఉండాల్సి వస్తోంది. అంతేకాకుండా అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వివిధ భారతీయ, అమెరికన్‌ కంపెనీలలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న భారతీయుల వీసాల పునరుద్ధరణ కూడా ఆలస్యం కానుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని