ట్రంప్‌ హామీ..భారత్‌కు 100వెంటిలేటర్లు

తాజా వార్తలు

Published : 16/06/2020 15:45 IST

ట్రంప్‌ హామీ..భారత్‌కు 100వెంటిలేటర్లు

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్లుగానే మంగళవారం 100 వెంటిలేటర్లు భారత్‌కు అందాయి. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ద్వారా భారత్‌కు 200 వెంటిలేటర్లు అందజేయడానికి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా మొదటగా 100 వెంటిలేటర్లను భారత్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు అందించినట్లు మనదేశంలో యూఎస్ దౌత్యవేత్త కెన్నత్ జస్టర్ వెల్లడించారు. అనంతరం జస్టర్ మాట్లాడుతూ..‘కరోనా మహమ్మారి మనందరికి  తీవ్రమైన ఆరోగ్య ముప్పును కలిగిస్తోంది. ప్రపంచ దేశాల భాగస్వామ్యం, సహకారంతోనే మన ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తుపై హామీ ఇవ్వగలం’ అని అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా విమానం ద్వారా వెంటిలేటర్లు భారత్‌కు చేరినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అమెరికా 200 వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్రంప్‌ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని