ఆ ఆందోళనలు అంతర్గత సంక్షోభాలకు సంకేతం..

తాజా వార్తలు

Published : 14/06/2020 20:05 IST

ఆ ఆందోళనలు అంతర్గత సంక్షోభాలకు సంకేతం..

మాస్కో: అమెరికా పోలీసుల చేతిలో మరణించిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం అనంతరం జరుగుతున్న ఆందోళనలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారిగా స్పందించారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార వ్యతిరేక నిరసనలు అక్కడ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన అంతర్గత సంక్షోభాలకు సంకేతమని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. రష్యా టెలివిజన్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌ ఈ విధంగా స్పందించారు. అంతేకాకుండా అక్కడ నెలకొన్న పరిస్థితులను కరోనా వైరస్‌ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితులతో పోల్చిన పుతిన్‌, అక్కడ సమస్యలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది కరోనా వైరస్‌పై పోరాటంలో తీసుకుంటున్న చర్యలతో ఈ సాధారణ సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చాయన్నారు.

ఈ సమయంలో కరోనా వైరస్‌ ప్రభావంతో అమెరికాలో, రష్యాలో ఏర్పడ్డ పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రష్యాలో దేవుడి దయతో తక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, కానీ, అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఇప్పటికే అక్కడ లక్షకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పుతిన్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని