ట్రంప్‌ అలా..కుమార్తె ఇలా..!

తాజా వార్తలు

Updated : 04/06/2020 14:05 IST

ట్రంప్‌ అలా..కుమార్తె ఇలా..!

నిరసనలకు మద్దతు తెలిపిన ట్రంప్‌ చిన్నకూతురు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్నకూతురు టిఫాని ట్రంప్‌ అమెరికా అల్లర్లపై స్పందించారు. పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. హింసాత్మక నిరసనలను అణచివేయని పక్షంలో సైన్యాన్ని దించుతానని ఆమె తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గవర్నర్లని హెచ్చరించిన నేపథ్యంలో టిఫాని మద్దతు తెలపడం గమనార్హం.

అమెరికాలో జాతి వివక్ష, పోలీసుల అరాచకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. వీటికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లోనూ బ్లాక్‌ఔట్‌ ట్యూస్‌డే, జస్టిస్‌‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హ్యాష్‌టాగ్‌ పేరుతో ట్రెండింగ్ అయ్యాయి. వీనికి మద్దతు పలుకుతూ అధ్యక్షుడు ట్రంప్‌ చిన్నకుమార్తె టిఫాని ట్రంప్‌ నలుపురంగులో ఉన్న ఫోటోను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్‌‌ చేశారు. అంతేకాకుండా ‘ఒంటరిగా పోరాడితే ఫలితం తక్కువే, కలిసి నడిస్తే ఎంతో సాధించవచ్చు’ అంటూ హెలెన్‌ కెల్లర్‌ మాటలను క్యాప్షన్‌గా రాశారు. ఆఫ్రో-అమెరికన్లకు టిఫాని మద్దతు పలకడంతో సామాజిక మాధ్యమాల్లో ఆమెను చాలా మంది ప్రశంసించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో భార్య, టిఫాని ట్రంప్‌ తల్లి కూడా దేశంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో సంఘీభావం తెలియజేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని