చైనా విమానాలకు నో ఎంట్రీ: అమెరికా

తాజా వార్తలు

Updated : 04/06/2020 12:49 IST

చైనా విమానాలకు నో ఎంట్రీ: అమెరికా

వాషింగ్టన్‌: కరోనా వైరస్ విషయంలో మొదట్నుంచి చైనాను తప్పుబడుతున్న అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్‌ 16 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్‌ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది మొదట్లో వుహాన్‌ ప్రావిన్స్‌కు అమెరికా తమ దేశానికి చెందిన విమానాల రాకపోకలు నిలిపివేసింది. అయితే జూన్‌ 1 నుంచి అమెరికా విమానయాన సంస్థలైన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ సేవలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన అనుమతుల మంజూరులో చైనా విఫలమైనందున అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలపై జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది.  

‘‘ఈ విషయమై అమెరికా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వర్గాలు చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దాని వల్ల రెండు దేశాల విమాన సంస్థలు తమ ద్వైపాక్షిక హక్కులను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఈ సమయంలో చైనా ప్రభుత్వం ఎన్ని అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతిస్తుందో అంతే స్థాయిలో చైనా విమానాలను అమెరికాలోకి అనుమతిస్తాం’’ అని అమెరికా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని