వచ్చేవారం భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు

తాజా వార్తలు

Published : 03/06/2020 09:23 IST

వచ్చేవారం భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు

వెల్లడించిన వైట్ హౌస్‌

వాషింగ్టన్‌: భారత్‌కు విరాళంగా ఇస్తామన్న వెంటిలేటర్లలో కొన్నింటిని వచ్చేవారం పంపనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వెల్లడించింది. నిన్న జరిగిన ఫోన్‌ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్‌ ..ప్రధాని మోదీకి ఈ విషయం చెప్పినట్టు తెలిపింది. తొలి విడతలో భాగంగా దాదాపు 100 వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొంది. భారత్‌కు సహాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్‌ సంతోషంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతకుముందు జరిగిన ఫోన్‌ సంభాషణలో జి-7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్రంప్‌ ఆహ్వానించారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపైనా చర్చించారు. అలాగే కొవిడ్‌-19 మహమ్మారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపైనా మాట్లాడుకున్నారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార నిరసనలపై ఆరా తీసిన మోదీ హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.  

కొవిడ్ 19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు సరఫరా చేస్తామని ట్రంప్‌ రెండు వారాల క్రితమే హామీ ఇచ్చారు. అమెరికా స్పందన పట్ల మోదీ అప్పట్లోనే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్ అభ్యర్థన మేరకు కొవిడ్ 19 చికిత్స నిమిత్తం భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని