‘HCQ వాడిన తర్వాత ట్రంప్‌ చక్కగా ఉన్నారు’

తాజా వార్తలు

Updated : 29/05/2020 10:24 IST

‘HCQ వాడిన తర్వాత ట్రంప్‌ చక్కగా ఉన్నారు’

వైట్‌ హౌజ్‌ అధికార ప్రతినిధి

వాషింగ్టన్‌: యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ) తీసుకున్న తర్వాత ట్రంప్‌ ఆరోగ్యంగా ఉన్నారని ‘వైట్‌ హౌజ్‌’కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కరోనా ముప్పు పొంచి ఉందని భావిస్తే మరోసారి కూడా హెచ్‌సీక్యూ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

‘‘ఇప్పుడే నేను అధ్యక్షుడి(ట్రంప్‌)ని కలిసి వస్తున్నాను. హెచ్‌సీక్యూ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారని అడిగాను. చక్కగా, అద్భుతంగా ఉన్నానని సమాధానం ఇచ్చారు. ముప్పు పొంచి ఉందని భావిస్తే మరోసారి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు’’ అని ‘వైట్‌ హౌజ్‌’ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మిషిగన్‌లోని ఓ ఆసుపత్రిలో 3000 మంది వైద్య సిబ్బంది ఇదే ఔషధాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. వారిలోనూ మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గమనించామన్నారు. చాలా మంది వైద్యులు, పరిశోధకులు హెచ్‌సీక్యూ వినియోగానికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు.

కొన్ని రోజుల క్రితం వైట్‌ హౌజ్‌లో పలువురు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ట్రంప్‌ ముందు జాగ్రత్తగా హెచ్‌సీక్యూ ఔషధాన్ని తీసుకున్నారు. అయితే, హెచ్‌సీక్యూ వాడకంపై అనేక మంది అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. దీన్ని వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) సైతం వైద్యుల సిఫార్సు లేకుండా వాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్‌ మాత్రం వాటన్నింటినీ కొట్టిపారేశారు. తొలి నుంచి ఆయన హెచ్‌సీక్యూకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా తనలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని