కరోనా: ఆ రెండు మందులు కలిపిస్తే..

తాజా వార్తలు

Published : 26/05/2020 16:41 IST

కరోనా: ఆ రెండు మందులు కలిపిస్తే..

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రబలిన దగ్గరి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా చాలామంది నోళ్లలో నానుతున్న పదం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌. కొవిడ్ 19 బాధితుల చికిత్సలో ఈ మందు వాడకం గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే దీన్ని వాడటం వల్ల గుండె మీద దుష్ప్రభావం చూపుతుందని వాండర్‌బిల్ట్, స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీన్ని అజిత్రోమైసిన్ యాంటి బయోటిక్‌తో కలిపి ఇస్తే ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వారు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాబేస్‌లో ఉన్న 21 మిలియన్ల కేసు రిపోర్టులను విశ్లేషించిన అనంతరం వారు నివేదికను తయారు చేశారు.

కొవిడ్ 19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధాలను విడిగా కానీ, కలిపికానీ వాడాలన్న ప్రతిపాదన నేపథ్యంలో వారు ఈ పరిశోధన చేపట్టారు. వాటి వాడకం గుండె కొట్టుకొనే క్రమపద్ధతిని దెబ్బతీస్తుందని వెల్లడించారు. క్లోరోక్విన్‌తో పోల్చుకుంటే అజిత్రోమైసిన్‌తో ఈ ప్రభావం మరీ ఎక్కువని అన్నారు. ఇక ఆ రెండింటిని కలిపితే ఆ తీవ్రత మరింత అధికమని తెలిపారు. క్లోరోక్విన్‌ కొన్ని నెలల పాటు వాడితే రక్త ప్రసరణను దెబ్బతీసి, గుండె వైఫల్యానికి దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తూ వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. 

ఇవీ చదవండి:

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై క్లినికల్ పరీక్షల నిలిపివేత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని