ఇవాంక ట్వీట్‌పై ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

తాజా వార్తలు

Updated : 24/05/2020 13:51 IST

ఇవాంక ట్వీట్‌పై ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

ఇంటర్నెట్‌డెస్క్‌: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్‌పై 1200 కిలోమీటర్లు తీసుకొచ్చిన బిహార్‌ బాలిక జ్యోతికుమారిని(15) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ శనివారం ప్రశంసించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో ఇవాంక.. జ్యోతిని మెచ్చుకుంటూ ‘ఎంతో ఓర్పుతో అద్భుతమైన, ప్రేమపూర్వక సాహసం’ చేసిందని కొనియాడారు. కాగా, ఈ ట్వీట్‌కు జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

పేదరికంతో.. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన జ్యోతి.. 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కడాన్ని థ్రిల్‌ కోసం చేసినట్లుగా అభివర్ణిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం జ్యోతిని ఓడించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఏదో  సాధించినట్లుగా చూడటం విడ్డూరమని పేర్కొన్నారు. మరోవైపు జ్యోతి సాహసాన్ని గుర్తించిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. భారత సైక్లింగ్‌ సమాఖ్య ఆమెకు ట్రయల్స్‌ నిర్వహించడానికి ముందుకొచ్చింది. అలాగే స్థానిక విద్యాశాఖ.. ఆమె మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇదీ చదవండి:

‘సైౖక్లింగ్‌ గర్ల్‌’ జ్యోతికి ఇవాంక ప్రశంసలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని