నేనూ ఆ మాత్రలు వేసుకుంటున్నా: ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 19/05/2020 12:18 IST

నేనూ ఆ మాత్రలు వేసుకుంటున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. గత 10 రోజుల నుంచి ఈ మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపారు. తనలో ఇప్పటి వరకూ ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనపడలేదని పేర్కొన్నారు. శ్వేతసౌధంలోని వైద్యులు సూచించకపోయినప్పటికీ.. తాను ఈ ఔషధాన్ని వాడుతున్నానని తెలిపారు. తాను క్లోరోక్విన్‌ తీసుకోవాలనుకుంటున్నానని వైద్యుడితో చెబితే ఆయనేమీ అభ్యంతరం చెప్పలేదని వివరించారు. రోజుకు ఓ మాత్ర చొప్పున వేసుకుంటున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న అనేక మంది వీటిని వాడుతున్నారని తెలిపారు. వారిలో మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గమనించామని.. అందువల్లే తానూ తీసుకుంటున్నానని పేర్కొన్నారు.  

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు తీసుకుంటున్నానని ట్రంప్‌ వెల్లడించిన కొద్దిసేపటికే శ్వేతసౌధం వైద్య వర్గాలు స్పందించాయి. ట్రంప్‌ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించాయి. తరచూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారని.. ఇప్పటివరకు అవన్నీ నెగిటివ్‌గానే వచ్చినట్లు డాక్టర్‌ కోన్లీ తెలిపారు.

ఇటీవల శ్వేతసౌధంలో పలువురి సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు ట్రంప్‌ సహాయకుడు సైతం ఉండడంతో అక్కడి వైద్యులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో ఇప్పటి వరకు 15,37,830 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 2,88,842 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. 90,694 మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి..

తాళం తీసిన ఐరోపా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని