ఒబామా గురించి అంతకన్నా ఏం చెప్పలేను

తాజా వార్తలు

Updated : 18/05/2020 11:52 IST

ఒబామా గురించి అంతకన్నా ఏం చెప్పలేను

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒబామా పెద్ద అసమర్థ నాయకుడని ట్రంప్‌ విమర్శించారు. శనివారం ఓ గ్రాడ్యుయేషన్‌ వార్షికోత్సవంలో ఒబామా మాట్లాడుతూ అమెరికాలో కరోనా వైరస్‌ కట్టడిపై స్పందిస్తూ.. ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండా, ఆయనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదే విషయాన్ని ఆదివారం మీడియా సమావేశంలో ఓ విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘ఒబామా ఒక అసమర్థ అధ్యక్షుడు.. ఆయన గురించి అంతకన్నా ఏం చెప్పలేను’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఒబామా కార్యాలయం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. 2017లో ఒబామా అధ్యక్షుడిగా దిగిపోయాక ఆయన సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. చాలా అరుదుగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. 

ఒబామా శనివారం ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ట్రంప్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. ఈ మహమ్మారి ప్రజల జీవితాలను సర్వ నాశనం చేసిందని, అంతా తలకిందులైందని చెప్పారు.

మరోవైపు అమెరికాలో ఇంకా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 15.26 లక్షలు దాటింది. తాజాగా, 24 గంటల్లో 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 90,931కి చేరువైంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశంగా అగ్రరాజ్యం కొనసాగుతోంది. ఇక రష్యా, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌ దేశాల్లోనూ వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. అగ్రరాజ్యం తర్వాత ఈ దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని