ఇంట్లో అలిగి కార్లో ఉడాయించిన 5ఏళ్ల బాలుడు

తాజా వార్తలు

Published : 07/05/2020 01:58 IST

ఇంట్లో అలిగి కార్లో ఉడాయించిన 5ఏళ్ల బాలుడు

న్యూయార్క్‌: అది అమెరికాలోని ఉటా రాష్ట్రం. సాధారణ తనీఖీల్లో భాగంగా అక్కడి పోలీసులు రోడ్డుపై వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అలా వారు ఓ కారును ఆపారు. అయితే అందులోని వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అతడిని ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించారు. అందుకు అతడు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. ఎందుకంటే కారులో ఉన్న అతడి వయస్సు ఐదేళ్లు!  ఆశ్చర్యంగా ఉందా? అయితే మీరూ చదివేయండి..

ఉటా రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల బాలుడు తన తల్లిని రెండు కోట్లు ఖరీదుచేసే లాంబోర్గిని కారు కొనివ్వాలని అడిగాడు. అందుకు బాలుడి తల్లి నిరాకరించింది. దీంతో తల్లి మీద అలిగిన బాలుడు ఆమె కారును సొంతగా నడుపుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. హైవేపైన పోలీసులు ఆపడంతో అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను అడిగిన లాంబోర్గిని కారు కొనిచ్చేందుకు తన తల్లి నిరాకరించిందని, అందుకే తన వద్ద ఉన్న మూడు డాలర్లతో కారు కొనేందుకు కాలిఫోర్నియా బయలుదేరినట్లు తెలిపాడు. ఆ సమాధానంతో ఆశ్చర్యపోయిన పోలీసులు, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు చేసిన పనికి కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది స్థానిక న్యాయస్థానం నిర్ణయిస్తుందని ఉటా పోలీసులు తెలిపారు. అయితే, బాలుడి తల్లిదండ్రులు మాత్రం తాము పనిలో ఉండగా తమను ఏమార్చి బయటికి వచ్చాడని, గతంలో ఎప్పుడూ అతడు కారు నడపలేదని చెప్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపట్ల మరింత జాగ్రత్తతో వ్యవహరించాలనేందుకు ఇదో చక్కని ఉదాహరణ.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని