‘పునర్నిర్మాణంలో భారత్‌తో కలిసి ముందుకు’

తాజా వార్తలు

Updated : 30/04/2020 23:32 IST

‘పునర్నిర్మాణంలో భారత్‌తో కలిసి ముందుకు’

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సంక్షోభంతో దెబ్బతిన్న అంతర్జాతీయ సరఫరా గొలుసు (సప్లయ్‌ చైన్‌)ను పునర్నిర్మించేందుకు భారత్‌తో కలసి పనిచేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. అంతేకాకుండా కరోనా మహమ్మారి చికిత్స కోసం వినియోగిస్తున్న మందుల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసినందుకు భారత్‌ను ప్రశంసిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తమ సన్నిహిత దేశాలైన ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియాతోపాటు వియత్నాం దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాంపియో పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను పూర్వస్థితికి తీసుకురావడంలో కీలకమైన సరఫరా గొలుసు సాఫీగా సాగేందుకు సమాచారాన్ని పంచుకోవడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంక్షోభం ఎదురైనప్పుడు ఈ గొలుసు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమయంలో మందుల ఎగుమతి నిషేధంపై భారత్‌ తీసుకున్న నిర్ణయమే ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి తాజా ఉదహరణ అని పాంపియో చెప్పుకొచ్చారు. గత కొన్నిరోజులుగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పలుసార్లు మాట్లాడినట్లు తెలిపారు.

 ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్న దేశాలను ఆదుకునేందుకు అమెరికా ముందుందని పాంపియో చెప్పారు. దీని కోసం ఇప్పటివరకు అమెరికా దాదాపు 650 కోట్ల డాలర్లను విరాళాల రూపంలో ఇచ్చినట్లు పాంపియో స్పష్టం తెలిపారు. ఇంత భారీ స్థాయిలో ప్రపంచంలో ఏదేశం ఇవ్వలేదని, ఇది చైనా చేసిన మొత్తం విరాళాల కంటే 12 రెట్లు ఎక్కువ అని గుర్తుచేశారు.

ఇవీ చదవండి..

చైనా నవంబరులోనే వైరస్‌ను గుర్తించిందా?

అమెరికాలో 2వేల మంది ఖైదీలను కరోనా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని