కరోనా వేళ.. డాన్‌ కుమార్తె ఏం చేశారంటే..

తాజా వార్తలు

Published : 28/04/2020 00:31 IST

కరోనా వేళ.. డాన్‌ కుమార్తె ఏం చేశారంటే..

మెక్సికో నగరం : కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమలుచేయడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. మెక్సికోలో అన్నార్తులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకువచ్చారు. వీరిలో మాదక ద్రవ్యాల రారాజుగా ప్రసిద్ధికెక్కిన జోక్విన్‌ గజ్మన్‌ అలియాస్‌ ఎల్‌చాపో కుమార్తె అలెజాండ్రియాన కూడా ఉండటం విశేషం. మెక్సికోలో అండర్‌గ్రౌండ్‌ డ్రగ్‌ మాఫియాలు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో సినలావా ముఠా పెద్దది. దీని అధిపతి ఎల్‌చాపో. ప్రస్తుతం అతను జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.

ఎల్‌చాపో బ్రాండ్‌తో సాయం..

ఎల్‌చాపో కుమార్తె ఎల్‌చాపో 701 ఫ్యాషన్‌ బ్రాండ్‌తో ఒక ఆన్‌లైన్‌ దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది. తన తండ్రిపేరుతోనే ఆమె ఈ సంస్థను నిర్వహిస్తుండటం గమనార్హం. తన తండ్రి చిత్రాన్ని ముద్రించిన బాక్స్‌ల్లో ఆహార పదార్థాలు ఉంచి ఆమె సంస్థకు చెందిన పలువురు వాలంటీర్లు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు అందించారు. 

ఇది ప్రచారానికే..

ఈ మార్చిలో మెక్సికోలో డ్రగ్స్‌ వార్‌లో దాదాపు 2600 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సాయాలు చేయడం ద్వారా తమ ఉనికిని నిరూపించుకునే యత్నంచేస్తున్నారని పోలీసువర్గాలు తెలిపాయి. హింసతో పాటు ఇలాంటి దాతృత్వ కార్యాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు వెల్లడించారు. మెక్సికోలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎక్కువమంది పేదలకు చేరకపోవడంతో వారు డ్రగ్స్‌ ముఠాల్లో చేరుతున్నారు.

ముఠాలకు కష్టకాలం..

కరోనా ప్రభావం మాదక ద్రవ్యాల ముఠాలపై పడింది. దక్షిణ అమెరికా నుంచి కొకైన్‌ ఎక్కువగా సరఫరా కావడం లేదు. పలు మాదక ద్రవాల్లో ఉపయోగించే రసాయనాలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే దేశాల సరిహద్దులు మూసివేయడంతో డ్రగ్స్‌ సరఫరాకు ఒక్కసారిగా బ్రేక్‌పడింది. అయితే ముఠానేతల వద్ద అపారధనం పోగుపడివుందని వీటితో మరికొన్ని సంవత్సరాలు ఎలాంటి పరిస్థితులనయినా వారు ఎదుర్కొంటారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని