కరోనా: సౌదీలో 11మంది భారతీయులు మృతి!

తాజా వార్తలు

Published : 24/04/2020 14:08 IST

కరోనా: సౌదీలో 11మంది భారతీయులు మృతి!

రియాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ విజృంభణతో అన్నిదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికాతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా సౌదీ అరేబియాలో 11మంది భారతీయులు ఈ వైరస్‌ బారినపడి మృతిచెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మదీనాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్‌, దమ్మాంలో ఒక్కొక్కరు మరణించినట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే అక్కడ ఉన్న భారత పౌరుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడున్న భారతీయులు సురక్షితంగానే ఉన్నారని..ఈ సమయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్యవార్తలను నమ్మవద్దని తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సహాయకేంద్రం నుంచి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. కొవిడ్‌ వైరస్‌కు సంబంధించిన సమాచారం కోసం సౌదీ ఆరోగ్యశాఖ టోల్‌ఫ్రీ నెంబర్‌ 937ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు సౌదీ అరేబియాలో 13,930 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 121మంది మరణించారు.

ఫిలిప్పైన్స్‌లో లాక్‌డౌన్‌ పొడగింపు..
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ పొడగించాలని ఫిలిప్పైన్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 15వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మనీలా, లుజోన్‌ పట్టణాల్లో ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలందరూ హోం క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు దేశంలో 6981 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 462మరణాలు సంభవించాయి.

దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ సడలింపు..
దేశవ్యాప్తంగా మే 1 నుంచి లాక్‌డౌన్‌ సడలింపులు ఉంటాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్‌ రామఫోస వెల్లడించారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఐదు అంచెల్లో హెచ్చరిక వ్యవస్థను అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశ జనాభాలో వైరస్‌ ఏ స్థాయిలో ఎలా విరుచుకుపడుతుందోనన్న విషయంపై కచ్చితమైన సమాచారం లేదని అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అయితే లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఐదు అంచెల వ్యవస్థతో సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ అమలవుతోంది. కాగా ఇప్పటివరకు దేశంలో 4వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 75మంది మరణించారు.

ఇవీ చదవండి..

అమెరికాలో మళ్లీ పెరిగిన మరణాలు..

భారత్‌లో 700దాటిన కరోనా మరణాలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని