అమెరికాలో మళ్లీ పెరిగిన మరణాలు

తాజా వార్తలు

Published : 24/04/2020 12:10 IST

అమెరికాలో మళ్లీ పెరిగిన మరణాలు

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి అగ్రరాజ్యానికి కాస్త ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలో గురువారం మరోసారి మరణాల సంఖ్య భారీగా పెరిగింది. జాన్‌ హాప్‌కిన్స్‌ అధ్యయనం ప్రకారం 24 గంటల్లో(బుధవారం-గురువారం మధ్య) 3,176 మంది మృతిచెందారు. దీంతో ప్రస్తుతం మృతుల సంఖ్య అక్కడ 50,363కు చేరింది. ఇక ఇప్పటి వరకు 8,89,999 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 82,112 మంది కోలుకున్నారు. 

ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో 27 లక్షల మందికి వైరస్‌ సోకి ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. 3000 మందిలో ‘యాంటీ బాడీ’ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ అంచనాకు వచ్చామని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ క్యుమో తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అధికారిక మరణాల సంఖ్య కంటే వాస్తవ మరణాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. నర్సింగ్‌ హోమ్స్‌, ఇళ్లు, కేర్‌ హోమ్స్‌లో చనిపోయినవారిలోనూ కొవిడ్‌-19 రోగులు ఉండి ఉంటారని తెలిపారు. దీని వల్ల కచ్చితమైన మరణాల రేటు అంచనా వేయలేమన్నారు. 

మరోవైపు న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టీకట్‌, డెట్రాయిట్‌, న్యూ ఓర్లీన్స్‌ ప్రాంతాల్లో తీవ్రత తగ్గిన సంకేతాలు ఉన్నాయని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తెలిపారు. దేశవ్యాప్తంగానూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే.. వేసవి ప్రారంభానికల్లా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థని తెరవడం క్రమంగా ప్రారంభించారన్నారు.

ఇవీ చదవండి..

ఆ డ్రగ్‌పై ఆశలు ఆవిరి?

వైరస్‌ను పసిగట్టే బయోసెన్సర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని