న్యూయార్క్‌లో వెంటిలేటర్‌పై 90% మృతి!

తాజా వార్తలు

Published : 23/04/2020 18:24 IST

న్యూయార్క్‌లో వెంటిలేటర్‌పై 90% మృతి!

ముంబయి: న్యూయార్క్‌లోని ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా రోగుల్లో 90% మంది మృతిచెందారని పరిశోధకులు కనుగొన్నారు. నగరంలోని నార్త్‌వెల్‌ హెల్త్‌లో ఆస్పత్రి పాలైన 5,700 బాధితుల ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. అధ్యయనం వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

నార్త్‌వెల్‌ హెల్త్‌లో చికిత్స పొందిన కొవిడ్‌-19 బాధితుల్లో 20% మంది మృతిచెందగా అందులో 88% మంది వెంటిలేటర్‌పై చనిపోయారని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో అతిపెద్ద కేసుల సిరీస్‌ ఇదేనని వారు పేర్కొన్నారు. ఆస్పత్రిలో 373 (14.2%) రోగులకు ఇంటెన్సిస్‌ కేర్‌లో చికిత్స అందించగా, 320 (12.2%)కు వెంటిలేషన్‌ అందించారు. 81 (3.2%) మూత్రపిండాల మార్పిడి చేసిన వారున్నారు. వీరిలో 553 (21%) మంది మరణించారు. మెకానికల్‌ వెంటిలేషన్‌ అందించిన వారిలో 88.1 శాతం మరణించారని పరిశోధకులు వెల్లడించారు. కాగా ఈ పరిశోధనలో కొన్ని పరిమితులు ఉన్నాయని వారు తెలిపారు.

‘ఈ అధ్యయనంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. మొదటిది మేం న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని రోగులనే తీసుకున్నాం. రెండోది ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డుల సమాచారాన్నే పరిశీలించాం’ అని వారు తెలిపారు. అమెరికాలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య 8.5 లక్షలకు చేరుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: లాక్‌డౌన్‌ నుంచి వీటికి మినహాయింపు

చదవండి: కరువు భత్యంపై కేంద్రం కీలక నిర్ణయం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని