చౌకగా విద్యుత్ అవసరంలేని వెంటిలేటర్ 

తాజా వార్తలు

Published : 20/04/2020 18:33 IST

చౌకగా విద్యుత్ అవసరంలేని వెంటిలేటర్ 

బెంగళూరు: కరోనాపై దేశం సాగిస్తున్న పోరులో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ/ప్రైవేటురంగ సంస్థలు తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ల తయారిపై దృష్టి సారించాయి. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డైనమాటిక్‌ టెక్‌ అనే సంస్థ తక్కువ ఖర్చుతో, విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే వెంటిలేటర్‌ను రూపొందించింది. దీన్ని కేవలం రూ. 2500కే అందివ్వనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ వెంటిలేటర్‌ పనిచేసేందుకు విద్యుత్ అవసరం లేదని, దేశీయంగా లభించే విడిభాగాలను ఉపయోగించి దీన్ని తయారుచేసినట్లు వెల్లడించింది.  ఈ వెంటిలేటర్‌ పీడనాన్ని, ఆక్సిజన్‌ను, శ్వాస రేటును అదుపులో ఉంచుతుందని సంస్థ తెలిపింది.

ఈ సంస్థ పనితీరును నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసించారు. ‘‘కేవలం రూ. 2500 ధరకే, విద్యుత్ అవసరం లేకుండా, పూర్తి దేశీయ విడిభాగాలతో రూపొందించిన ఈ వెంటిలేటర్‌ పీడనం హెచ్చు/తగ్గులు నిర్వహిస్తూ, ఆక్సిజన్‌ను, శ్వాస రేటును అదుపులో ఉంచుతుంది. ప్రస్తుతం వీరు రూపొందించిన వెంటిలేటర్‌ హెల్త్‌ సెంటర్లు, స్థానిక ఆస్పత్రుల్లో ఎంతో కీలకం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలి’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. డైనమాటిక్‌ టెక్‌ ఎయిర్‌బస్‌, బోయింగ్ వంటి సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తుంది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రస్తుతం దాదాపు 60 వేల వెంటిలేటర్లు అందుబాటులోఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 వేల వెంటిలేటర్లు ఉండగా, మిగిలినవి ప్రైవేటు రంగంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 1.10 నుంచి 2.20 లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో దేశీయంగా వీటిని రూపొందించేందుకు తామున్నామంటూ డీఆర్‌డీఓ, భారతీయ రైల్వే సహా దేశంలోని వివిధ సాంకేతిక, వైద్య, విద్యా, పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగాయి. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని