ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు: సౌదీ మతపెద్ద

తాజా వార్తలు

Updated : 18/04/2020 12:58 IST

ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు: సౌదీ మతపెద్ద

రియాద్‌: వచ్చే వారం ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. రంజాన్‌ పర్వదినంలో మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా ప్రార్థనల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. సౌదీలో ఇప్పటి వరకు 7,142 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 87 మంది మృత్యువాతపడ్డారు.    

ఇటు హైదరాబాద్‌లోనూ జామియా నిజామియా సంస్థ ఇదే తరహా సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీనికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సైతం మద్దతు తెలిపారు. సంస్థ సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని