ఇక విమానాశ్రయంలోనే కరోనా నిర్ధారణ!

తాజా వార్తలు

Updated : 16/04/2020 18:10 IST

ఇక విమానాశ్రయంలోనే కరోనా నిర్ధారణ!

రక్త పరీక్షలతో కేవలం 10నిమిషాల్లోనే ఫలితం!

దుబాయ్: విమానయానంతో ఎంత వేగంగా ప్రయాణించామో, కరోనా వైరస్‌ కూడా ప్రపంచదేశాలకు అంతే వేగంగా పాకింది. విమాన ప్రయాణాలు చేసే వారిలో వైరస్‌ ఎవరికి ఉందో? లేదోనని తెలుసుకోలేకపోవడం వైరస్‌ ఇంత వేగంగా వ్యాపించడానికి ఓ కారణం. ఇప్పటివరకూ విదేశీ ప్రయాణం చేసేవారికి కేవలం స్క్రీనింగ్‌ మాత్రమే నిర్వహించి కరోనా లక్షణాలు గుర్తించేవారు. కానీ, కరోనా వైరస్‌ను అతి తక్కువ సమయంలోనే గుర్తించే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయాల్లో రాపిడ్‌ కిట్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించే సదుపాయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తాజాగా ప్రారంభించింది. ఇలా విమానాశ్రయాల్లో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయడం ఇదే తొలిసారని సదరు సంస్థ వెల్లడించింది. 

దుబాయ్‌లో విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతోంది. దీనిలో భాగంగా తొలుత దుబాయి నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. విమాన ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణీకుల రక్త నమూనాలు సేకరించి కరోనా వైరస్‌ పరీక్ష చేస్తారు. వీటి ఫలితం కేవలం పది నిమిషాల్లోనే వస్తుందని ఎమిరేట్స్‌ సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిని అన్నిరకాల విమానాల్లో అమలు చేస్తామని విమానయాన అధికారులు పేర్కొన్నారు.

అరబ్‌ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని