భారత్‌కు ధన్యవాదాలు: ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 09/04/2020 03:48 IST

భారత్‌కు ధన్యవాదాలు: ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా నియంత్రణకు ఔషధంగా భావిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భారత ప్రజలకు ట్రంప్‌ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘‘అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరం. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రజలకు ధన్యవాదాలు. భారత్‌ చేసిన సహాయాన్ని మర్చిపోలేం. కరోనాపై పోరాటంలో మీ బలమైన నాయకత్వానికి, మానవత్వానికి ధన్యవాదాలు మోదీ’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడి  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కావాలని కోరారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు పలురకాల మందులపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 
దేశీయ అవసరాలకు తగిన నిల్వలు ఉంచుకొని, మిగిలినదానిని ఇరుగుపొరుగు దేశాలకు, మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. అంతకుమందు ట్రంప్‌ మాట్లాడుతూ.. తాము కోరిన రీతిలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ మందును ఎగుమతి చేయకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని