వాయు కాలుష్యం కూడా ఆజ్యం పోస్తుంది!

తాజా వార్తలు

Published : 09/04/2020 01:39 IST

వాయు కాలుష్యం కూడా ఆజ్యం పోస్తుంది!

మృతుల పెరుగుదలకు అది కూడా ఓ కారణమన్న శాస్త్రవేత్తలు

 దిల్లీ: కరోనావైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారిలో వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి,  ఇతర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నవారు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. మృతి చెందిన వారిని గమనిస్తే ఇదే విషయం వెల్లడవుతుంది. అయితే వాయు కాలుష్యంతో ప్రభావితమైన వారు కూడా కొవిడ్ 19 మృతుల జాబితాలో ఉండొచ్చని ఇటలీలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఇటలీలో మరణాల రేటును గమనించి వారు ఓ పరిశోధనాపత్రాన్ని  వెలువరించారు. 
ఇటలీలో కరోనా ఎంతటి విలయం సృష్టించిందో తెలిసిందే. అయితే ఇటలీ ఉత్తర భాగంతో పోలిస్తే, మిగతా ప్రాంతంలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తల బృందం గమనించింది. అందుకు  వాయు కాలుష్యం కూడా ఓ కారణం కావొచ్చని వారు భావిస్తున్నారు. నాసా శాటిలైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ ప్రాంతం ఐరోపాలోనే అత్యంత కాలుష్యభరితమైంది. అక్కడి ప్రాంతాలైన లాంబార్డీ, ఎమీలియా రొమాగ్నాల్లో 12 శాతం కొవిడ్ మరణాలు సంభవించగా, దేశం మొత్తం అది 4.5శాతంగా ఉందని తేలింది. అయితే కాలుష్య కారకాలు అక్కడే నిలిచిపోడానికి ఆ ప్రాంత భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. దీనికి సంబంధించి వారు ఎలుకల మీద కూడా పరిశోధన నిర్వహించారు. అయితే కాలుష్యంతో పాటు అక్కడి మరణాలకు వయసు, ఆరోగ్య సేవల్లో తేడా, ఐసీయూల సామర్థ్యం కారణమైందని తెలిపారు.  
కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్‌ డాక్టర్ మానస్‌ రంజన్‌ రాయ్‌ దీనిపై స్పందించారు. ‘వాయు కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతుంటాయి. వారు ఇతర వైరస్‌ల బారిన పడే అవకాశం ఎక్కువ. భారతీయుల మీద రైనోవైరస్‌ తొందరగా దాడి చేస్తుంది. కానీ మనలో వృద్ధి చెందిన రోగనిరోధక శక్తి కారణంగా నాలుగు నుంచి ఐదు రోజుల్లో దాన్నుంచి కోలుకునే అవకాశం ఉంది. కానీ కొవిడ్-19 మాత్రం కొంతమంది మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన వెల్లడించారు. అయితే మనదేశంలో ఇలాంటి కాలుష్యభరిత ప్రాంతాలు తక్కువేమి లేవన్న సంగతి తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని