90 నగరాల్లో తగ్గిన కాలుష్యం

తాజా వార్తలు

Published : 29/03/2020 23:58 IST

90 నగరాల్లో తగ్గిన కాలుష్యం

 వాహనాలు రోడ్డెక్కక మెరుగుపడిన వాయు నాణ్యత
 తగ్గుముఖం పట్టిన విద్యుత్తు డిమాండ్‌

దిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు రోడ్డెక్కక, కర్మాగారాలు పనిచేయక కాలుష్యం తగ్గుతోంది. దేశ రాజధాని దిల్లీ సహా 90 నగరాల్లో కొద్దిరోజులుగా కనీస స్థాయి కాలుష్యం నమోదవుతోంది. ఆ మేరకు వాయు నాణ్యత మెరుగుపడుతోంది. దిల్లీలో సూక్ష్మాతిసూక్ష్మ ధూళి కణాల స్థాయి 30% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అహ్మదాబాద్‌, పుణెల్లో ఇది 15% తగ్గింది. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే నైట్రోజన్‌ ఆక్సైడ్‌ కాలుష్యం ముంబయిలో 43% తగ్గిపోయింది. మరికొన్ని నగరాల్లో 38-50% వరకు తగ్గింది. సాధారణంగా మార్చిలో కాలుష్యం ‘ఒక మోస్తరు’ కేటగిరీలో ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ‘సంతృప్తికరం’, ‘బాగుంది’ అనే స్థాయిలో మెరుగుపడిందని అధికారులు తెలిపారు. దిల్లీలో వాయు నాణ్యత సంతృప్తికర స్థాయికి చేరింది. అత్యంత కాలుష్యభరితమైన కాన్పుర్‌లో సయితం పరిస్థితి మెరుగుపడింది. 39 నగరాల్లో వాయు నాణ్యత ‘బాగుంది’ అనే స్థాయికి చేరింది.
28% తగ్గిన విద్యుత్తు వినియోగం
దేశవ్యాప్త ఆంక్షలు, మూసివేతల వల్ల విద్యుత్తు వినియోగం 28% మేర తగ్గిపోయింది. ఈ నెల 20న గరిష్ఠ వినియోగ సమయంలో 163 గిగావాట్లకు డిమాండ్‌ ఉంటే శనివారం అది 117 గిగావాట్లకు పడిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు మాత్రం ఇది ఇబ్బందికరమే. విద్యుత్తు ఎక్స్ఛేంజిల్లో యూనిట్‌ ధర సగటున రూ.2 ఉంటుంది. అలాంటిది గిరాకీ లేక నాలుగు రోజుల క్రితం 60 పైసలే పలికింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని