అమెరికా ప్రథమ మహిళకు కరోనా పరీక్ష!

తాజా వార్తలు

Published : 24/03/2020 11:43 IST

అమెరికా ప్రథమ మహిళకు కరోనా పరీక్ష!

వాషింగ్టన్‌: అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌ వచ్చిందని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు. ‘‘మెలానియా ఆరోగ్యంగానే ఉంది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కాగా, ట్రంప్‌కు కూడా మార్చి 13న కరోనా పరీక్షను నిర్వహించటం... దానిలో నెగిటివ్‌ రావటం తెలిసిందే. ఆయన భార్య మెలానియాకు కూడా అదే రోజు పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు ఫలితాన్ని వెల్లడించారు.
అంతేకాకుండా ట్రంప్‌ కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ఆయన భార్య కరెన్‌ పెన్స్‌లకు కూడా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్టు అమెరికా అధ్యక్ష నివాసం  ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 41,000కు పైగా నమోదైంది. 540 కరోనా పాజిటివ్‌ కేసులు, 99 మృతులతో న్యూయార్క్‌లో కరోనా విజృంభిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని