వైద్య పరికరాలపై కర్ణాటక అప్రమత్తం

తాజా వార్తలు

Published : 23/03/2020 13:44 IST

వైద్య పరికరాలపై కర్ణాటక అప్రమత్తం

బెంగళూరు: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా కర్ణాటక ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య పరికరాల కొరత ఏర్పడకుండా 1000 వెంటిలేటర్ల, 5లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలను తెప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం స్కాన్‌రే సంస్థతో చర్చలు సైతం జరిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘1000 వెంటిలేటర్లు తెప్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)లు 5లక్షలు తెప్పించనున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 26కు చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వాణిజ్య కార్యకలాపాల్ని నిలిపివేయాలని సూచించింది. అంతేకాకుండా బెంగళూరు సిటీ, రూరల్‌, మంగళూరు, మైసూరు, కలబుర్గి, దార్వద్‌, చిక్కబల్లాపుర, కొడగు, బెళగావీల్లో కేంద్రం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని