ఏళ్ల తర్వాత ఇడ్లిబ్‌లో ప్రశాంత వాతావరణం!

తాజా వార్తలు

Updated : 06/03/2020 13:47 IST

ఏళ్ల తర్వాత ఇడ్లిబ్‌లో ప్రశాంత వాతావరణం!

మాస్కో: సైనిక ఘర్షణలతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. టర్కీ, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడమే దీనికి కారణం. తరచూ సైనిక దాడులతో ఈ ప్రాంతంలో మానవత్వ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఆరుగంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వైమానిక ఘర్షణలకు స్వస్తి పలికి ఈ ప్రాంతంలోని పౌరులకు భయాందోళన నుంచి విముక్తి కల్పించాలి. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది పౌరులు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోయారు. పలువురు టర్కీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని