కరోనా ఎఫెక్ట్‌: ప్రధాని బెల్జియం పర్యటన రద్దు

తాజా వార్తలు

Published : 05/03/2020 17:27 IST

కరోనా ఎఫెక్ట్‌: ప్రధాని బెల్జియం పర్యటన రద్దు

దిల్లీ: ఈనెల బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరగాల్సిన ‘భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ సదస్సు’ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన రద్దయినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనావైరస్‌ కారణంగా విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇరుదేశాల ఆరోగ్యశాఖ అధికారులు సూచించినట్లు తెలిపింది. అనుకూలమైన మరో తేదీన ఈ సదస్సు నిర్వహించేందుకు ఇరుదేశ అధికారులు నిర్ణయించారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. భారత్‌-ఈయూ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే పరస్పర సహకారంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి హాజరుకావాల్సిన ఈ సదస్సు నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ గత నెల బ్రసెల్స్ పర్యటించివచ్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని