పోప్‌నూ వదలని కరోనా భయం

తాజా వార్తలు

Updated : 02/03/2020 18:25 IST

పోప్‌నూ వదలని కరోనా భయం

వాటికన్ సిటి: దగ్గు, జలుబు కారణంగా వారం రోజుల పాటు రోమ్‌ ప్రాంతంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోవడంలేదని రోమన్‌ క్యాథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదివారం ప్రకటించారు. 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అనారోగ్య కారణాలతో సమావేశాలకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. ఇటలీలో కరోనా (కొవిడ్-19) వైరస్‌ ప్రభావం ఉన్న నేపథ్యంలో పోప్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఆయన పలుమార్లు దగ్గుతూ కనిపించారు. ప్రార్థన చివర్లో ఆయన అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్నందున నేను ఈ సంవత్సరం ప్రార్థనా సమావేశంలో పాల్గొనలేకపోతున్నాను. కానీ, నేను ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మీ అందరికోసం ప్రార్థిస్తాను’’ అని తెలిపారు. తీవ్ర జలుబుతో బాధపడుతున్న కారణంగా ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు. దీని గురించి వాటికన్‌ సిటీ అధికారిక ప్రకటన చేసింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ స్వల్ప అనారోగ్యం బాధపడుతున్నారని తెలపింది. ఇప్పటికే ఇటలీ వ్యాప్తంగా 1,000 మంది పైగా కరోనా బారిన పడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని