సీఏఏతో ఎవరికీ ముప్పు ఉండదు: అజిత్

తాజా వార్తలు

Published : 02/03/2020 01:33 IST

సీఏఏతో ఎవరికీ ముప్పు ఉండదు: అజిత్

ముంబయి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల ఏ పౌరుడికీ ఎలాంటి నష్టమూ ఉండదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన ఎన్సీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ఎవరి పౌరసత్వాన్ని హరించవు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై బిహార్‌ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని సాకుగా చూపుతూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అజిత్‌ పవార్‌ తప్పుబట్టారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. గత నెల ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ సీఏఏపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. దీని వల్ల ఎవరూ దేశం నుంచి బయటకు వెళ్లరని తెలిపారు. మరోవైపు మహా అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయిన కాంగ్రెస్‌ సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేస్తోంది. సీఏఏను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ సైతం గత డిసెంబర్‌లోనే స్పష్టం చేశారు. ఇలా  సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కో పార్టీ ఒక్కో వైఖరి తీసుకోవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని