తాజ్‌ అందాలపై మెలానియా ట్వీట్

తాజా వార్తలు

Published : 27/02/2020 14:54 IST

తాజ్‌ అందాలపై మెలానియా ట్వీట్

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన సతీమణి మెలానియాతో కలిసి తాజ్‌ను సందర్శించారు. దాదాపు గంటపాటు తాజ్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చారిత్రక కట్టడం అందాలను ఆస్వాదించారు. తాజాగా మెలానీయా ట్రంప్‌ భర్త ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్‌ అందాలను వీక్షించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ప్రపంచంలోని  వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా వీక్షించడం ఉత్కంఠతను కలిగించింది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. 47 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో మెలానియా భర్త ట్రంప్‌తో కలిసి తాజ్‌ ప్రాంతంలో కలియ తిరుగుతూ కనిపించారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గైడ్ నితిన్ కుమార్‌ తాజ్‌ ప్రాముఖ్యతను వారికి వివరించారు. దానితో పాటు ట్రంప్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ తాజ్‌మహల్‌ వద్ద అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.  

థ్యాంక్యూ ఇండియా: ఇవాంకా

మరో పక్క ట్రంప్‌ కుమార్తె ఇవాంకా కూడా భారత పర్యటనపై ఇన్‌స్టాగ్రాం వేదికగా స్పందించారు. తాజ్‌మహల్ వద్ద తన భర్త కుష్నర్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ థ్యాంక్యూ ఇండియా అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని