కేసీఆర్‌తో ట్రంప్‌ కరచాలనం

తాజా వార్తలు

Updated : 25/02/2020 20:25 IST

కేసీఆర్‌తో ట్రంప్‌ కరచాలనం

రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైన విందు కార్యక్రమం

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అగ్రరాజ్య అధిపతి ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కరచాలనం చేసి రాష్ట్రపతిభవన్‌లోని రామ్‌పూర్వ బుల్‌ విగ్రహ ప్రత్యేకతతో పాటు చారిత్రక నేపథ్యాన్ని ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ స్వయంగా వివరించారు. బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటో దిగారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో ట్రంప్‌ దంపతులు మాట్లాడారు. విందుకు అతిథులుగా వచ్చిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి ట్రంప్‌కు పరిచయం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అతిథులతో ట్రంప్‌ దంపతులు కరచాలనం చేశారు. ట్రంప్‌ కోసం ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక విందులో శాకాహారం, మాంసాహారంతో వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని