వాణిజ్య బంధం మరింత బలోపేతం: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 25/02/2020 13:06 IST

వాణిజ్య బంధం మరింత బలోపేతం: ట్రంప్‌

దిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌ .. ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ...ఇరుదేశాల వాణిజ్య బంధం మరింత ముందుకెళ్తోందన్నారు. వేలాదిమంది ప్రజలు స్వాగతించడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఘన స్వాగతం పలికిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌ పర్యటనకు వచ్చిన ట్రంప్‌ బృందానికి ఈ సందర్భంగా మోదీ ..హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌.. మీడియాతో మాట్లాడనున్నారు. తన రెండ్రోజుల పర్యటనపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏర్పాటుచేసే విందు కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొననున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని