మెలానియా పాఠశాల సందర్శనపై కేజ్రీవాల్‌ ట్వీట్

తాజా వార్తలు

Updated : 25/02/2020 12:56 IST

మెలానియా పాఠశాల సందర్శనపై కేజ్రీవాల్‌ ట్వీట్

దిల్లీ: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ దక్షిణ దిల్లీలోని మోతీ బాగ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న విషయం తెలిసిందే. అక్కడి హ్యాపీనెస్‌ తరగతుల నిర్వహణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. తాజాగా మెలానియా పాఠశాల సందర్శనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘పాఠశాలలోని హ్యాపీనెస్‌ తరగతులను అమెరికా ప్రథమ మహిళ సందర్శించనున్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, దిల్లీ వాసులకు ఇది ఎంతో గొప్పరోజు. శతాబ్దాలుగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను నేర్పింది. ఇప్పుడు ఆమె అదే ఆనందకరమైన సందేశాన్ని మా పాఠశాల నుంచి తీసుకెళ్లడంపట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని ట్వీట్ చేశారు.  

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్‌ తరగతుల్లో బాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం, విధేయతతో మెలగడం వంటివి నేర్పిస్తారు. మంగళవారం మధ్యాహ్నం మెలానియా ఈ పాఠశాలను సందర్శించి, దాదాపు గంటపాటు విద్యార్థులతో గడపనున్నట్లు సమాచారం. తొలుత ఈ పర్యటనలో మెలానియాతో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే వీరికి ఆహ్వానం అందకపోవడంపై ఆప్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ కేజ్రివాల్, సిసోడియా హాజరుపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని