మెలానియా పర్యటన: కేజ్రీకి దక్కని ఆహ్వానం!

తాజా వార్తలు

Updated : 24/02/2020 09:59 IST

మెలానియా పర్యటన: కేజ్రీకి దక్కని ఆహ్వానం!

దిల్లీ: భారత పర్యటనకు విచ్చేస్తున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనున్నారు. అయితే మెలానియా పర్యటనకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు ఆహ్వానం లభించలేదట. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ఈ నెల 24న భారత్‌కు రానున్నారు. ఫిబ్రవరి 25న మెలానియా దక్షిణ దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి హ్యాపీనెస్‌ తరగతుల నిర్వహణను పరిశీలించనున్నారు. విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఈ పర్యటనలో మెలానియా వెంట కేజ్రీవాల్‌, సిసోడియా కూడా ఉంటారని, హ్యాపీనెస్‌ తరగతుల గురించి వీరు అమెరికా ప్రథమ మహిళకు వివరిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. 

కాగా.. నిజానికి పర్యటనపై కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ఇంతవరకూ ఎలాంటి ఆహ్వానం లభించలేదని తాజాగా ఆప్‌ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్‌, సిసోడియాను తప్పించారని తెలుస్తోంది. అయితే దీనిపై అటు దిల్లీ ప్రభుత్వం నుంచి గానీ, కేంద్రం నుంచి గానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు తాజా వార్తలపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందిస్తూ.. ‘కార్యక్రమానికి ఎవర్ని ఆహ్వానించాలని.. ఎవర్ని ఆహ్వానించకూడదు అనే దానిపై భారత ప్రభుత్వం అమెరికాకు ఎలాంటి సూచనలు చేయట్లేదు’ అని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌ తాజ్‌ పర్యటనలో మోదీ ఉండరట..!

మోదీ, ట్రంప్‌ భేటీలో సీఏఏ ప్రస్తావన!

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని