దేశమంతా శివోహం.. శివోహం..

తాజా వార్తలు

Updated : 21/02/2020 12:05 IST

దేశమంతా శివోహం.. శివోహం..

దిల్లీ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవుడికి పూజలు అందిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో నీలకంఠుడి పట్ల ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ‘ఓం నమ: శివాయ’ మంత్రోచ్చరణతో ఆ త్రినేత్రుడి యందు మనసుని లగ్నం చేసి తన్మయత్వం పొందుతున్నారు. భారీ భక్తజనుల తాకిడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

* ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వరాలయంలో ఆదిదేవుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న వేదపండితులు.

* పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ‘శివాలయ బాగ్‌ భయాన్‌’ ఆలయాన్ని శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలా సర్వాంగసుందరంగా అలంకరించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బోలాశంకరుడికి మొక్కులు సమర్పించుకుంటున్నారు.

* దిల్లీ చాందినీ చౌక్‌ ప్రాంతంలోని గౌరీ శంకర్‌ ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు

* కర్ణాటకలోని కలబురగిలో స్థానికంగా లభించే గింజలతో 25 అడుగుల ఎత్తు శివలింగాన్ని రూపొందించారు. బ్రహ్మకుమారీలు నిర్మించిన ఈ శివలింగానికి 300 కేజీల గింజలు అవసరమైనట్లు సమాచారం.

* ముంబయిలోని బాబుల్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు.

* కాశీ విశ్వనాథున్ని దర్శించుకునేందుకు వారణాసిలో భక్తులు పోటెత్తారు. నేటి పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని