అధికారులను పరుగులు పెట్టిస్తున్న ‘బీస్ట్‌’

తాజా వార్తలు

Updated : 24/02/2020 10:03 IST

అధికారులను పరుగులు పెట్టిస్తున్న ‘బీస్ట్‌’

ఆగ్రా: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా తాజ్‌మహల్‌ని సందర్శించనున్నారు. ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ఈ ప్రేమసౌధాన్ని వీక్షించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం జరగనున్న ఈ పర్యటన ఆగ్రా జిల్లా అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇందుకు రెండు కారణాలున్నాయి. ట్రంప్‌ ఉపయోగించనున్న ప్రత్యేక వాహనం ‘ద బీస్ట్‌’ ను తాజ్‌ వరకూ అనుమతిస్తారా అన్న సంశయం తలెత్తుతోంది. 1998లో సుప్రీంకోర్టు ఈ 16వ శతాబ్దపు కట్టడం పరిసరాల్లోకి విద్యుత్తు వాహనాలను తప్ప మరే ఇతర వాహనాల ప్రవేశాన్ని అనుమతిచ కూడదని ఆదేశించింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు అధికారులు ‘బీస్ట్‌’కు ప్రత్నామ్నాయాన్ని ఆలోచించారు. ట్రంప్‌ను తాజ్‌ ముంగిట నిలపటానికి బ్యాటరీతో నడిచే అత్యాధునిక బస్సును సిద్ధం చేశారు. ఈ విధంగా సమస్యకు పరిష్కారం లభించిందనే వారు అనుకుంటున్నారు. 

మరోపక్క, విమానాశ్రయం నుంచి ఆగ్రా నగరానికి వచ్చే మార్గంలో ఓ రైల్వే వంతెన ఉంది. ఈ వారధిపై భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ నేపథ్యంలో 6.4 టన్నుల బరువుండే బీస్ట్‌తో సహా ట్రంప్‌ వాహన శ్రేణిలో అధిక సంఖ్యలో ఉండే కార్ల ధాటికి ఈ వంతెన తట్టుకోగలదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. కాగా ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రజా పనుల శాఖ అధికారులు ఈ అనుమానాలను కొట్టి పడేస్తున్నారు. ట్రంప్‌ వాహనం కార్ల విభాగంలో బరువైనదే కానీ... బస్సు, ట్రక్కు వంటి భారీ వాహనాల కంటే కచ్చితంగా తక్కువ బరువే ఉంటుందని వివరించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే వంతెనను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు చెబుతున్నారు. 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ విమానాశ్రయం నుంచి తాజ్‌ పరిసరాల వరకు తన భారీ కారులోనే ప్రయాణించటం గమనార్హం.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని