రిక్షావాలాను కలిసిన ప్రధాని మోదీ

తాజా వార్తలు

Updated : 18/02/2020 12:11 IST

రిక్షావాలాను కలిసిన ప్రధాని మోదీ

వారణాసి: ఒక రోజు పర్యటన నిమిత్తం తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళ్ కేవత్ అనే రిక్షా లాగే వ్యక్తిని కలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మంగళ్‌ కేవత్ తన కుమార్తె వివాహానికి రావాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. దీనిపై ఫిబ్రవరి 8న ప్రధాని కార్యలయం నుంచి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమకు లేఖ అందిందని మంగళ్‌  తెలిపారు. ‘‘మా కుమార్తె వివాహానికి రావాలని మొదటి శుభలేఖను  దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ఇచ్చాను. ఫిబ్రవరి 8న ప్రధాని మోదీ లేఖ ద్వారా మాకు శుభాకాంక్షలు  తెలిపారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము’’ అని మంగళ్‌ అన్నారు. అయితే తాజాగా ఆదివారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మంగళ్‌ను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా గంగా నది శుభ్రతకు ఆయన చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. మోదీ స్వచ్ఛ బారత్‌ స్ఫూర్తితో మంగళ్‌ కేవత్ తన గ్రామంలో గంగా నది పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని