చాలు చాలు...ఇక చాలించండి

తాజా వార్తలు

Published : 15/02/2020 23:23 IST

చాలు చాలు...ఇక చాలించండి

 మా అంతర్గత విషయంలో జోక్యం వద్దు

 టర్కీ అధ్యక్షుడికి భారత్‌ సూచన

దిల్లీ: పాకిస్థాన్‌ పార్లమెంటులో ప్రసంగిస్తూ టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోంగాన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్‌ ఘాటుగా స్పందించింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇక చాలించాలని ఆయనకు సూచించింది. జమ్మూ-కశ్మీర్‌ను ఉద్దేశించి ఎర్డోగాన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖండిస్తున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ శనివారం పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌ భారత అంతర్భాగమని పునరుద్ఘాటించారు. పాక్‌లో పర్యటిస్తున్న టర్కీ అధ్యక్షుడు శుక్రవారం ఆ దేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడారు. జమ్మూ-కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దును ఉద్దేశిస్తూ- ‘‘కశ్మీర్‌ ప్రజలు దశాబ్దాల తరబడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలి ఏకపక్ష నిర్ణయాలతో వారి బాధలు మరింత ఎక్కువయ్యాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని