సుప్రీం కోర్టు ఆవరణలో బ్యాగు కలకలం!

తాజా వార్తలు

Published : 14/02/2020 23:20 IST

సుప్రీం కోర్టు ఆవరణలో బ్యాగు కలకలం!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని సుప్రీం కోర్టు ఆవరణలో శుక్రవారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులోని పవర్‌ బ్యాంక్‌ కారణంగా భయాందోళన నెలకొంది. దీంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించిన అనంతరం ప్రమాదమేమీ లేదని తేల్చారు. కోర్టు పనివేళ్లలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని బ్యాగులోంచి బీప్‌ బీప్‌ మంటూ శబ్దం రావడంతో గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే ఎవరూలేని ప్రదేశంలోకి తీసుకెళ్లారు. బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశాక అందులో ఓ పవర్‌ బ్యాంక్‌ కారణంగానే ఆ శబ్దం వచ్చిందని తేల్చారు. బ్యాగును కంట్రోల్‌రూమ్‌కు అప్పగించామని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ ఘటన మూలంగా కోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని