మూడో ప్రైవేటు రైలు వచ్చేస్తోంది...

తాజా వార్తలు

Updated : 13/02/2020 12:25 IST

మూడో ప్రైవేటు రైలు వచ్చేస్తోంది...

వారణాసి-ఇండోర్‌ పట్టణాల మధ్య ‘కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్’

దిల్లీ: దేశంలో మూడో ప్రైవేటు రైలు ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఇండియన్‌ రైల్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో... వారణాసి-ఇండోర్‌ పట్టణాల మధ్య నడిచే ఈ ‘కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్’ ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ రైలు సర్వీసు 20వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని అధికారులు ప్రకటించారు.

‘కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్’ వారణాసి ఇండోర్‌ల మధ్య వారానికి మూడు సార్లు నడుస్తుంది. మూడు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్ (ఇండోర్‌, మధ్యప్రదేశ్‌)‌, మహాకాళేశ్వర్‌ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌), కాశీ విశ్వనాథ (వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌)లతో సహా...  ఇండోర్‌, భోపాల్‌ వంటి పారిశ్రామిక, విద్యా కేంద్రాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుందని అధికారులు వివరించారు. అంతేకాకుండా దీనిలో ప్రయాణికులకు రూ.10 లక్షల ప్రయాణ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని