సీఏఏ వ్యతిరేక జాబితాలో పుదుచ్చేరి

తాజా వార్తలు

Published : 12/02/2020 16:15 IST

సీఏఏ వ్యతిరేక జాబితాలో పుదుచ్చేరి

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం 

పుదుచ్చేరి: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల జాబితాలోకి తాజాగా మరో రాష్ట్రం చేరింది. సీఏఏను వ్యతిరేకిస్తూ కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ఆరో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేశాయి. 

కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకోవాలని కోరుతూ తమ అసెంబ్లీలో తీర్మానించామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. ఏఐఏడీఎంకే, ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీకే హాజరు కాలేదు. సభకు హాజరుకాని ఈ సభ్యులు సీఏఏకు వ్యతిరేకంగా సభలో ఎలాంటి చర్చలు, తీర్మానాలు చేయకూడదని రెండు రోజుల ముందే సభాపతిని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ చేసిన చట్టం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందని ఆ రాష్ట్ర లెఫ్టనెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని వ్యతిరేకించడం, ప్రశ్నించలేమని రెండురోజుల ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఘాటు లేఖ రాశారు. దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమవడాన్ని తప్పుబట్టారు. వీటన్నింటి నడుమ పుదుచ్చేరి అసెంబ్లీ సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని