అసలైన దేశభక్తి అంటే ఇదీ: సిసోడియా

తాజా వార్తలు

Updated : 11/02/2020 22:51 IST

అసలైన దేశభక్తి అంటే ఇదీ: సిసోడియా

దిల్లీ: ఈ ఎన్నికల్లో తమ తీర్పుతో హస్తిన ప్రజలు జాతీయవాదానికి నిజమైన నిర్వచనం ఇచ్చారని ఆప్‌ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అన్నారు. పత్పర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భం భాజపా జాతీయవాదం సంబంధిత అంశాల చుట్టే తిరిగిందని గుర్తుచేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే అసలైన దేశభక్తి అన్నారు. విభజన, విద్వేషపూరిత రాజకీయాలను దిల్లీ ఓటర్లు తిరస్కరించారని చెప్పారు.

పత్పర్‌గంజ్‌ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించడం తనకెంతో సంతోషంగా ఉందన్న సిసోడియా.. ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్లు పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు గెలిపించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం ద్వారా జాతీయవాదానికి నిజమైన అర్థాన్ని చెప్పారన్నారు. మనీశ్‌ సిసోడియా భాజపా అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ నేగిపై 3500 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలుత వీరిద్దరి మధ్య హోరా హోరీగా పోరు సాగింది. అయితే, చివరకు స్వల్ప మెజార్టీతోనే సిసోడియా బయటపడ్డారు. 2013 ఎన్నికల్లో సిసోడియా 11వేల ఓట్ల మెజార్టీ సాధించగా.. 2015 ఎన్నికల్లో 28 వేలకు పైగా ఓట్లు తేడాతో విజయం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని