రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్‌?

తాజా వార్తలు

Published : 16/01/2020 05:20 IST

రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్‌?

ప్రతిపాదించిన అధ్యక్షుడు పుతిన్‌

మాస్కో: రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్‌ రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడు పుతిన్‌కు సమర్పించారు. మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాతే మెద్వదేవ్‌ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రష్యా కొత్త  ప్రధానిగా మిషుస్తిన్‌ పేరును పుతిన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అధినేతగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మెద్వదేవ్‌ బాధ్యతలు చేపట్టాలని పుతిన్‌ సూచించారు.

లక్ష్యాలను చేరుకోవడంలో మెద్వదేవ్‌ మంత్రివర్గం విఫలమైందని పుతిన్‌ భావిస్తున్నారని రష్యా మీడియా తెలిపింది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన మెద్వదేవ్‌ 2012 నుంచి ఇప్పటి వరకు రష్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని