‘ఆందోళనల్లో విపక్షాలు ఐకమత్యంగా ఉండాలి’

తాజా వార్తలు

Published : 14/01/2020 13:18 IST

‘ఆందోళనల్లో విపక్షాలు ఐకమత్యంగా ఉండాలి’

సీఏఏ నిరసనలపై అమర్త్యసేన్‌ పరోక్ష వ్యాఖ్యలు

కోల్‌కతా: ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కోల్‌కతాలో సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాంటి ఆందోళనలకైనా విపక్షాల ఐక్యత చాలా ముఖ్యం. సరైన ప్రయోజనం కోసం పోరాడుతున్నప్పుడు ఐక్యమత్యం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై లేనంత మాత్రాన ఆందోళనలు ఆగాల్సిన అవసరం లేదు’’ అని సేన్‌ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నామనే దానిపై కూడా స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధినేతలు కూడా మనస్ఫూర్తిగా ఆందోళనల్లో పాల్గొనాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కులకు భంగం కలుగుతోందని భావించినప్పుడు తప్పకుండా నిరసన వ్యక్తం చేయాలని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమర్త్యసేన్‌ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ మౌలికసూత్రాలకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉందని.. వెంటనే రద్దు చేయాలని గతంలో డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని