గురుద్వారాపై దాడిని ఖండించిన సోనియా

తాజా వార్తలు

Published : 05/01/2020 01:33 IST

గురుద్వారాపై దాడిని ఖండించిన సోనియా

దిల్లీ: పాకిస్థాన్‌లోని నాన్‌కానా సాహిబ్‌లోని గురుద్వారాపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఖండించారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెచ్చి నిందితులు అరెస్టయ్యేలా చేయాలన్నారు. గురుద్వారా వద్ద సిక్కు భక్తులు, ఉద్యోగుల భద్రత ఎంతో ఆందోళనకరంగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ అధికారులతో మాట్లాడి వారికి భద్రత కల్పించేలా కృషి చేయాలన్నారు. పాకిస్థాన్‌లోని గురుద్వారాపై శుక్రవారం కొందరు రాళ్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. సిక్కు వర్గానికి చెందిన ఓ యువతిని మరో వర్గం యువకుడు మత మార్పిడి చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతడి కుటుంబసభ్యులు గురుద్వారా వద్ద నిరసనకు దిగారు. అనంతరం అది ఉద్రిక్తంగా మారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌ ప్రభుత్వానికి సూచించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని