Fumio Kishida: జపాన్‌ ప్రధానిగా ఫూమియో కిషిదా..!

తాజా వార్తలు

Published : 04/10/2021 23:45 IST

Fumio Kishida: జపాన్‌ ప్రధానిగా ఫూమియో కిషిదా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ సరికొత్త ప్రధానిగా ఫుమియో కిషిదా ఎంపికయ్యారు. సోమవారం జపాన్‌ చట్టసభ సభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. 64 ఏళ్ల కిషిదా హిరోషీమాకు చెందిన ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. నేడు జరిగిన ఓటింగ్‌లో ఆయన వ్యాక్సిన్‌ చీఫ్‌ టారో కోనోను ఓడించారు. ఓటింగ్‌ తర్వాత ఆయన తోటి సభ్యులు అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను బలంగా ఎదుర్కొంటానని చెప్పారు. అనంతరం ఆయన 12 మంది పేర్లతో కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. సుగా మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది కొత్త కేబినెట్‌లో కొనసాగుతున్నారు. వీరిలో ఆర్థిక, రక్షణ శాఖ గత మంత్రివర్గంలో ఉన్నవారి వద్దే ఉన్నాయి. ఫుమియోకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసి భారత్‌-జపాన్‌ వ్యూహాత్మక సంబంధాలను ముందు తీసుకెళతానని ఆశాభవం వ్యక్తం చేశారు. 

ఇప్పటి వరకు జపాన్‌ ప్రధానిగా వ్యవహరించిన యషిహిడి సుగా నేటి ఉదయం పార్లమెంట్‌లో రాజీనామా సమర్పించారు. తాను అధికారిక ఎల్‌డీపీ పార్టీ నాయకుడిగా కొనసాగడంలేదని ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని