Trump: చైనా వైరస్‌ అన్నారని కేసు..!

తాజా వార్తలు

Published : 23/05/2021 16:03 IST

Trump: చైనా వైరస్‌ అన్నారని కేసు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు కష్టాలను తీసుకొచ్చాయి. చైనీస్‌-అమెరికన్‌ పౌరహక్కుల గ్రూప్‌ ఒకటి ఆయనపై కోర్టులో కేసు వేసింది. ఆయన కొవిడ్‌-19 వైరస్‌ను ‘చైనా వైరస్‌’అన్నారని పేర్కొంది. ఈ మేరకు చైనీస్‌ అమెరికన్‌ సివిల్‌రైట్స్‌ సంస్థ(సీఏసీఆర్‌సీ) న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ఫిర్యాదు చేసింది. కరోనావైరస్‌ను ట్రంప్‌ ఆధార రహితంగా చైనా వైరస్‌ అని అభివర్ణించారని పేర్కొంది. ఈ వైరస్‌ విషయంలో ట్రంప్‌ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఫలితంగా ఇటీవల కాలంలో ఆసియన్‌ అమెరికన్లపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇప్పటికి కూడా ట్రంప్‌ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చైనీస్‌ వైరస్‌ అనే పదాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. 

ఇప్పుడు అమెరికాలోని ప్రతి ఆసియన్‌ అమెరికన్‌కు 1 డాలర్‌ చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ కోరంది. అంటే మొత్తం 22.9 మిలియన్‌ డాలర్లు అవుతాయి. ఈ నిధితో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి.. ఆసియా జాతుల వారు అమెరికా సమాజ అభివృద్ధికి ఎలా కృషి చేశారో తెలియజేసే వస్తువులను అక్కడ ఏర్పాటు చేయాలని సీఏసీఆర్‌సీ భావిస్తోంది.  దీనిపై ట్రంప్‌ సలహాదారుడు జేసన్‌ మిల్లర్‌ ‘ది హిల్‌’ పత్రికతో మాట్లాడుతూ ‘ఇది చాలా అరాచకమైన, మూర్ఖమైన లాసూట్‌. పూర్తి హాస్యాస్పదమైంది. నేనే ఆ కేసుకు లాయర్‌ అయితే.. కేసును చూసి కోర్టు నాపై ఆంక్షలు విధిస్తుందని భయపడతాను ’ అని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని