యూకే నుంచి భారత్‌కు చేరిన వైద్య సామగ్రి సాయం

తాజా వార్తలు

Updated : 27/04/2021 11:03 IST

యూకే నుంచి భారత్‌కు చేరిన వైద్య సామగ్రి సాయం

దిల్లీ: కరోనా ఉద్ధృతితో ఆపత్కాలంలో ఉన్న తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్‌కు తక్షణ సాయంగా బ్రిటన్‌ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాచీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘అంతర్జాతీయ సహకారం కార్యరూపం దాల్చింది. ఆపత్కాలంలో భారత్‌కు సహకారం అందిస్తున్న బ్రిటన్‌కు అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరుకున్నాయి’ అని బాగ్చీ ట్వీట్‌లో పేర్కొన్నారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ద్వారా వైద్య సామగ్రి భారత్‌కు చేరిన ఫొటోలను ఆయన ట్వీట్‌లో పంచుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న వేళ పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బ్రిటన్‌ కూడా భారత్‌కు సహకారం అందిస్తామని ప్రకటించింది. దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ స్పందిస్తూ.. ఈ వారంలో 495 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 120 నాన్‌ ఇన్వేసివ్‌ వెంటిలేటర్లు, 20 మ్యానువల్‌ వెంటిలేటర్లు బ్రిటన్‌ నుంచి పంపనున్నట్లు తెలిపింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని